

నైజాం ప్రాంతంలో సినిమా పంపిణీ రంగం ఇటీవల చురుకుగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ చిన్న సినిమాలను విడుదల చేస్తుండగా, అన్నపూర్ణ సంస్థ కూడా పంపిణీకి దిగింది. ఈ పరిణామాల మధ్య ఎస్వీసీ సంస్థ వరుసగా సినిమాలు కొనుగోలు చేస్తోంది. “గాయపడ్డ సింహం” సినిమా పై వార్తల తర్వాత, తాజాగా శ్రీవిష్ణు నటించిన ‘విష్ణు విన్యాసం’ ను ఆస్ట్రేలియా వెంకట్ కొనుగోలు చేసినట్లు ప్రకటించారు.
‘విష్ణు విన్యాసం’ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. “సామజవరగమన” వంటి విజయాల తర్వాత ఈ జానర్ శ్రీవిష్ణుకు బాగా సరిపోతుందని భావిస్తున్నారు. టీజర్ విడుదల తర్వాత ఫ్యామిలీతో పాటు యూత్ టచ్ కూడా కనిపించడంతో ఆసక్తి పెరిగింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 7.20 కోట్లకు అమ్ముడయ్యాయి.
సినిమా బడ్జెట్ దాదాపు రూ. 21 కోట్లు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు షూట్ చేసినప్పటికీ, అవి ఎడిటింగ్‌లో తొలగించబడ్డాయి. అయినా ఖర్చు తగ్గలేదు. డిజిటల్, ఆడియో హక్కుల ద్వారా రూ. 8.70 కోట్లు వచ్చాయి. కర్ణాటక హక్కులపై రూ. 50 లక్షలు లభించాయి. ఇంకా కొంత రికవరీ అవసరం ఉండగా, ఓవర్సీస్ నుంచి రూ. 2 కోట్ల వరకు ఆశిస్తున్నారు. హిందీ డబ్బింగ్, శాటిలైట్ హక్కులు నిర్మాత వద్దే ఉండటంతో రిలీజ్ సమయానికి సేఫ్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా బాగా ఆడితే నిర్మాతకు మంచి లాభాలు రావచ్చు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!