

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆర్‌సీ17కు సంబంధించి మరోసారి ఆలస్యం జరిగే అవకాశాలున్నాయనే ప్రచారం మొదలైంది. ఈ చిత్ర కథను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దేందుకు సుకుమార్ అదనపు సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో కథ, పాత్రలు, సన్నివేశాలు ఉండేలా స్క్రిప్ట్‌ను మెరుగుపరుస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే సుకుమార్ సినిమాలపై భారీ అంచనాలు ఉండటంతో ఆర్‌సీ17 విషయంలోనూ ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ మణికట్టు గాయం నుంచి కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఫిజియోథెరపీ తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో షూటింగ్ షెడ్యూల్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే చిత్ర బృందం నుంచి ఆలస్యంపై అధికారిక ప్రకటన రాలేదు. కథ విషయంలో సుకుమార్ తీసుకుంటున్న సమయం, రామ్ చరణ్ చికిత్స కారణంగా తదుపరి షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న ఆసక్తి పెరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!