

సూపర్ స్టార్ రజినీకాంత్, యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ధర్మన్’. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. ఇందులో రజినీకాంత్ డెడ్లీ డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం ఇప్పటికే ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రామ్ పోతినేని ఈ చిత్రంలో రజినీకాంత్‌కు వ్యతిరేకంగా కనిపించబోతున్నారనే రూమర్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రజినీకాంత్ పాత్రకు అల్లుడిగా, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో రామ్ పోతినేని కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈ వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రామ్ పోతినేనిని ఈ పాత్ర కోసం సంప్రదించినట్టు మాత్రమే టాక్ వినిపిస్తోంది. ఆయన ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. ఒకవేళ రామ్ పోతినేని ‘ధర్మన్’లో భాగమైతే రజినీకాంత్‌తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకోవడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇద్దరు హీరోలు ఎదురెదురుగా కనిపించే సన్నివేశాలు అభిమానులకు భారీ ట్రీట్‌గా నిలవొచ్చనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు రామ్ పోతినేని హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తన సినిమా షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నారు. అందువల్ల ‘ధర్మన్’ విషయంలో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!