

సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి భాగం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో సీక్వెల్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్, రజినీకాంత్ పారితోషికానికి సంబంధించిన వివరాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అందుతున్న సమాచారం ప్రకారం, నటీనటుల పారితోషికాలతో కలిపి సినిమా బడ్జెట్ రూ.240 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో రజినీకాంత్ సుమారు రూ.110 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు, అదనంగా లాభాల్లోనూ వాటా పొందే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వివరాలను నిర్మాణ సంస్థ అధికారికంగా ధ్రువీకరించలేదు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణన్, విద్యాబాలన్, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!