

‘జైలర్ 2’ తర్వాత సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న చిత్రం ‘ధర్మన్’. ఉలగనాయకన్ కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ చిత్రాల ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2027లో విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, తాజా మీడియా కథనాల ప్రకారం సినిమా విడుదల తేదీలో మార్పు జరిగే అవకాశం ఉంది.
చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ‘ఇండియన్ 3’ చిత్రాన్ని పండుగ సీజన్లో విడుదల చేయాలని కమల్ హాసన్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ‘ధర్మన్’ చిత్రాన్ని 2027 వేసవికి వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. విడుదల తేదీపై రజినీకాంత్‌తో కమల్ హాసన్ చర్చలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనిపై రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో రామ్ పోతినేని, రాశీ ఖన్నా, సిమ్రన్, యోగి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!