

మలయాళ సినీ పరిశ్రమలో క్లాసిక్ ప్రేమకథగా నిలిచిపోయిన ‘ప్రేమమ్’ చిత్రం 2015లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. నివిన్ పౌలీ హీరోగా, ఆల్ఫాన్స్ పుత్రేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‌లను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈ చిత్రం తక్కువ బడ్జెట్‌తో రూపొందినా భారీ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది.
దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత నివిన్ పౌలీ, ఆల్ఫాన్స్ పుత్రేన్ కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నివిన్ పౌలీ కెరీర్‌లోని 50వ చిత్రానికి ఆల్ఫాన్స్ పుత్రేన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్‌ను జూన్ 27న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ‘ప్రేమమ్’ మ్యాజిక్‌ను మరోసారి చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!