

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ను యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా, వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. ప్రస్తుతం సీజీ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సీజీ పూర్తి కాకపోవడంతోనే ఇప్పటివరకు సినిమా విడుదలను ఒకటికి రెండు సార్లు వాయిదా వేశారు. దీంతో కొత్త రిలీజ్ డేట్పై స్పష్టత లేకుండా పోయింది. ఇదే సమయంలో ‘విశ్వంభర’ తర్వాత మొదలుపెట్టిన మెగాస్టార్ సినిమా సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘విశ్వంభర’ను జూన్ నెలలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సీజీ పనులు పూర్తి చేయడం పెద్ద సమస్య కాకపోయినా, జనవరిలో మెగాస్టార్ సినిమా విడుదలైన తర్వాత కనీసం ఆరు నెలల గ్యాప్ ఇవ్వాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. అందుకే జూన్ విడుదలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
ప్రారంభంలో విడుదలైన టీజర్లో సీజీ క్వాలిటీపై భారీగా ట్రోలింగ్ జరిగింది. దీంతో ఈసారి సీజీ పూర్తిగా పర్ఫెక్ట్గా ఉన్నాకే సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు గట్టిగా నిర్ణయించుకున్నారు. సమ్మర్ సీజన్ అయిన ఏప్రిల్లో విడుదల చేయాలంటే రెండు సినిమాల మధ్య సరైన గ్యాప్ ఉండదనే కారణంతో, జూన్లో ‘విశ్వంభర’ విడుదలయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.









.jpeg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!