
ఆరోగ్యం

టాలీవుడ్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఫంకీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ, కొత్త ఏడాదిలో మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడని సమాచారం. ఈసారి మళ్లీ విశ్వక్ సేన్ రాజకీయ పాత్రలో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో సాలిడ్ రోల్‌తో మెప్పించిన విశ్వక్ సేన్, ఇప్పుడు ఫుల్ లెంగ్త్ పొలిటికల్ డ్రామాలో నటించబోతున్నాడట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన (రేపు) గురువారం విడుదల అవుతుందని బలమైన ప్రచారం ఉంది. కళాహీ మీడియా ఇచ్చిన తాజా అప్డేట్ కూడా ఇదే కాంబినేషన్ త్వరలో అనౌన్స్ అవుతుందనే సంకేతాలు ఇస్తోంది. రేపటి ప్రకటన తో పూర్తి క్లారిటీ రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!