

కన్నడ భామ రుక్మిణి వసంత్ ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమెకు తెలుగులో మరో పెద్ద అవకాశం దక్కినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ‘96’, ‘మెయ్యళగన్’ వంటి భావోద్వేగ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా ఓ కొత్త సినిమా రూపొందనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కథానాయికగా రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ సినిమా మనసుకు హత్తుకునే ప్రేమకథగా రూపొందనుందని, ఇందులో రుక్మిణి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ ప్రాజెక్ట్‌లోనూ రుక్మిణి భాగమవుతున్నట్లు సమాచారం. నాని చిత్రంలోనూ ఆమె నటించనున్నట్లు వస్తున్న వార్తలతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నటీనటులు, ఇతర వివరాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!