

ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో వస్తున్న కొన్ని రూమర్స్ ని చూసి అభిమానులు భయపడిపోతున్నారు. అవి కేవలం రూమర్స్ మాత్రమే కదా, పట్టించుకోవాల్సిన అవసరం లేదని పక్కకి వెళ్లిపోవాలా?, లేదా అది నిజమో కాదో నిర్ధారణ చేసుకోవాలా అనే సందిగ్దతలో పడిపోతున్నారు నెటిజెన్స్. ఎందుకంటే ఈమధ్య కాలం లో రూమర్స్ గా వినిపిస్తున్న అత్యధిక శాతం వార్తలు నిజం అయ్యాయి కాబట్టి. ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ‘వారణాసి’ సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడట. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ లెవెల్ కి తీసుకెళ్లిన రాజమౌళి, సినిమాలకు గుడ్ బై చెప్పడం ఏంటి?, అదెలా సాధ్యం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు, మరికొందరు ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేస్తున్నారు.
అయితే రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ అని ఇప్పటికే అనేక సార్లు చెప్పుకొచ్చాడు. ఈ మహాభారతం సిరీస్ తోనే రాజమౌళి తన కెరీర్ కి ముగింపు పలుకుతాడు అనే రూమర్ కూడా ఉంది. ‘వారణాసి’ చిత్రం పూర్తి అయ్యాక కొంత గ్యాప్ తీసుకొని ఆయన చేయబోయేది ‘మహాభారతం’ అని అంటున్నారు. అయితే ఈ కథను ఒక్క సినిమాతో చెప్పడం సాధ్యం కాదని, కనీసం రెండు మూడు భాగాలు అవసరం అవుతాయని, కానీ రాజమౌళి మాత్రం దీన్ని ఏకంగా 8 భాగాలుగా తెరకెక్కించాలనుకుంటున్నాడట.
ఈ 8 సినిమాలు పూర్తి కావడానికి సగటున పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే రాజమౌళి ఇకపై హీరో సెంట్రిక్ సినిమాలు చేయడని, అలా అయితే చివరి హీరో ఆధారిత చిత్రం ‘వారణాసి’ కావచ్చని అంటున్నారు. అయితే ఈ మహాభారతం ని స్టార్ క్యాస్టింగ్ తో తీయడం అసాధ్యమైన పని కావొచ్చు. ఎందుకంటే స్టార్ హీరోలు అన్నేళ్లు కేవలం ఒక్క సినిమా కి కేటాయించడం ప్రాక్టికల్ గా కష్టమే. కాబట్టి రాజమౌళి ఈ ఎపిక్ ని కొత్త వాళ్ళతో తెరకెక్కిస్తాడేమో అని అంచనా వేస్తున్నారు నెటిజెన్స్. అయితే అభిమానులు మాత్రం కృష్ణుడిగా మహేష్ బాబు, అర్జునుడిగా రామ్ చరణ్, కర్ణుడిగా ప్రభాస్, భీముడిగా ఎన్టీఆర్ను ఊహించుకుంటూ AI వీడియోలు కూడా తయారు చేస్తున్నారు. మరి రాజమౌళి కొత్తవాళ్లతో ఈ మెగా ప్రాజెక్ట్ ని తీస్తే, అభిమానుల రియాక్షన్ ఏంటో చూడాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!