

2005 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కుమార్ రవి బిహార్‌లో ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆహార భద్రతా కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఆధ్వర్యంలో మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. మొత్తం 38 జిల్లాల్లో రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, క్విక్ కామర్స్ డెలివరీ కేంద్రాలు, కిరాణా దుకాణాలను అధికారులు తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో భాగంగా రూ.17.32 లక్షల విలువైన ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడం లేదా ధ్వంసం చేయడం జరిగింది. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 15 సంస్థలపై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరో రెండు సంస్థల నిర్వహణ లైసెన్సులను సస్పెండ్ చేశారు. ఆహార కల్తీ, అపరిశుభ్రత, గడువు ముగిసిన ఉత్పత్తుల విక్రయాలను అరికట్టడమే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన లక్ష్యమని సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!