

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పలు స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 17 చోట్ల మున్సిపాలిటీలు ఏకగ్రీవం కాగా, వాటిలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 15 స్థానాలను దక్కించుకుంది. జనసేన, బీజేపీ చెరో మున్సిపాలిటీని ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
వార్డుల వారీగా చూస్తే కూటమి పార్టీలకు చెందిన 726 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో టీడీపీ నుంచి 660 మంది, జనసేన నుంచి 38 మంది, బీజేపీ నుంచి 28 మంది ఉన్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ నుంచి 19 మంది, సీపీఐ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థులు ఐదుగురు ఏకగ్రీవమయ్యారు. ఉమ్మడి కడప జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో ఆరు చోట్ల కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం వార్డుల్లో 21.08 శాతం, డివిజన్లలో 12.58 శాతం ఏకగ్రీవాలు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!