

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ప్రీ-గ్లింప్స్‌తో సినిమా స్థాయి మరింత పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. విజువల్స్, కాన్సెప్ట్, భారీ స్కేల్ కారణంగా ఈ చిత్రంపై దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ‘వారణాసి’ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డీల్ ఫైనల్ అయితే టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత పెద్ద డీల్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపు రూ.1400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!