Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కీరవాణి కోడలిగా బలగం హీరోయిన్‌?

01:47 PM, 24 మార్చి, 2026
కీరవాణి కోడలిగా బలగం హీరోయిన్‌?

టాలీవుడ్‌ సెలబ్రిటీలు కేవలం ప్రొఫెషనల్ పనులతోనే కాకుండా తమ వ్యక్తిగత జీవితంపైనా దృష్టి పెడుతున్నారు. జీవితంలో కొత్త అడుగు వేయడానికి, పెళ్లి బంధంలోకి అడుగుపెట్టడానికి చాలామంది ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ, అల్లు శిరీష్‌ పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. అటు బెల్లంకొండ శ్రీనివాస్‌ తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు.

ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, గాయకుడు కాల భైరవ కూడా ఈ జాబితాలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బలగం హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్‌తో అతడు ప్రేమలో ఉన్నాడనే వార్తలు కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీసింహ హీరోగా నటించిన ఉస్తాద్ సినిమా సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడి, అదే క్రమంలో ప్రేమగా మారిందని అంటున్నారు. సినిమా సెట్లో మొదలైన ఈ పరిచయం తర్వాత ఇద్దరి మధ్య బంధం మరింత బలపడిందని సమాచారం. కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రేమకు అంగీకారం తెలిపారని, త్వరలోనే పెళ్లి జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఒక కార్యక్రమానికి కావ్య, కాల భైరవ కలిసి హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, తమ ప్రేమను పరోక్షంగా వెల్లడించారని నెటిజన్లు భావిస్తున్నారు.

కావ్య కల్యాణ్‌రామ్ భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి చెందినది. ఆమె గంగోత్రి సినిమాలో బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, బాలు, బన్నీ, పాండురంగడు వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. 2022 లో వచ్చిన మసూద సినిమాతో హీరోయిన్‌గా మారి, బలగం సినిమాతో మంచి గుర్తింపు పొందింది. కాల భైరవ 2019 లో వచ్చిన మత్తు వదలరా సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. కలర్ ఫోటో, ఆకాశవాణి, లక్ష్య, కార్తికేయ 2, గుర్తుందా శీతాకాలం, మోగ్లీ, మత్తు వదలరా 2, యుఫోరియా వంటి చిత్రాలకు సంగీతం అందించాడు. అలాగే బాహుబలి 2లో పాడిన “దండాలయ్యా” పాటతో గాయకుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి పాడిన “నాటు నాటు” పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. అదే సినిమాలోని “కొమురం భీముడో” పాటకు కాల భైరవ జాతీయ అవార్డు అందుకున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రధాని కి ఏపీ సీఎం విషెస్..

ప్రధాని కి ఏపీ సీఎం విషెస్..

యుద్ధ భయంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

యుద్ధ భయంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

మహేష్ బాబు ఆ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడా?

మహేష్ బాబు ఆ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడా?

యుద్ధం మరింత తీవ్రం కానుందా? అమెరికా ప్లాన్‌లు

యుద్ధం మరింత తీవ్రం కానుందా? అమెరికా ప్లాన్‌లు

గ్యాస్ కొరతతో తిరువణ్ణామలై ఆలయంలో లడ్డూ తయారీ నిలిపివేత!

గ్యాస్ కొరతతో తిరువణ్ణామలై ఆలయంలో లడ్డూ తయారీ నిలిపివేత!

పెద్ద రియాలిటీ షోకు ఆ హీరో హోస్ట్‌గా మారాడా..?

పెద్ద రియాలిటీ షోకు ఆ హీరో హోస్ట్‌గా మారాడా..?

కీరవాణి కోడలిగా బలగం హీరోయిన్‌?

కీరవాణి కోడలిగా బలగం హీరోయిన్‌?

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుంచి ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ గ్రాండ్ లాంచ్

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుంచి ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ గ్రాండ్ లాంచ్

డ్రగ్స్ కేసులో అరెస్ట్

డ్రగ్స్ కేసులో అరెస్ట్

ట్రంప్‌, నెతన్యాహుకు యూకే బిగ్‌ షాక్‌

ట్రంప్‌, నెతన్యాహుకు యూకే బిగ్‌ షాక్‌

ట్యాగ్లు
టాలీవుడ్కాల భైరవకావ్య కల్యాణ్ రామ్ఎం ఎం కీరవాణిబలగం సినిమాతెలుగు సినిమాసెలబ్రిటీ వార్తలువైరల్ వీడియోటాలీవుడ్ జంటఎంటర్టైన్మెంట్ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పంజుర్లి వివాదంపై రణ్‌వీర్ సింగ్ కీలక నిర్ణయం… క్షమాపణకు సిద్ధం
సినిమాలు

పంజుర్లి వివాదంపై రణ్‌వీర్ సింగ్ కీలక నిర్ణయం… క్షమాపణకు సిద్ధం

తమిళనాడు ఎన్నికల్లో కీలక నిర్ణయం… పోటీకి దూరమైన కమల్ హాసన్ పార్టీ
రాజకీయాలు

తమిళనాడు ఎన్నికల్లో కీలక నిర్ణయం… పోటీకి దూరమైన కమల్ హాసన్ పార్టీ

ఆర్సీబీని కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్
క్రీడలు

ఆర్సీబీని కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్

దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతుంది - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతుంది - సీఎం రేవంత్ రెడ్డి

బీజాపూర్‌లో భారీ పరిణామం… మావోయిస్టు అగ్రనేత పాపారావు లొంగుబాటు
న్యూస్

బీజాపూర్‌లో భారీ పరిణామం… మావోయిస్టు అగ్రనేత పాపారావు లొంగుబాటు

ఐపీఎల్ కెప్టెన్ లతో రేపు బీసీసీఐ మీటింగ్
క్రీడలు

ఐపీఎల్ కెప్టెన్ లతో రేపు బీసీసీఐ మీటింగ్

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వడగళ్ల వాన
న్యూస్

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వడగళ్ల వాన

ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్: రూ.15,000 కోట్లకు పైగా రాజస్థాన్ రాయల్స్ అమ్మకం
క్రీడలు

ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్: రూ.15,000 కోట్లకు పైగా రాజస్థాన్ రాయల్స్ అమ్మకం

‘బ్యాండ్ మేళం’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను - శ్రీ విష్ణు
సినిమాలు

‘బ్యాండ్ మేళం’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను - శ్రీ విష్ణు

పశ్చిమాసియా పరిస్థితులపై మోదీకి ట్రంప్ ఫోన్
న్యూస్

పశ్చిమాసియా పరిస్థితులపై మోదీకి ట్రంప్ ఫోన్

తమిళనాడు అసెంబ్లీ: ఉచితంగా ఫ్రిజ్‌.. పురుషులకూ ఫ్రీ బస్‌
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ: ఉచితంగా ఫ్రిజ్‌.. పురుషులకూ ఫ్రీ బస్‌

కీరవాణి కోడలిగా బలగం హీరోయిన్‌?
గాసిప్స్

కీరవాణి కోడలిగా బలగం హీరోయిన్‌?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!