

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల మహేష్ బాబు శ్రీరాముడి లుక్‌లో ఉన్నట్లు కనిపించే స్టాండీ ఫోటో నెట్టింట చక్కర్లు కొట్టగా, అది అధికారిక లుక్నా లేక AI క్రియేషన్‌నా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రంలో మహేష్ బాబు శ్రీరాముడి ప్రేరణతో రూపొందిన పాత్రలో కీలక సన్నివేశాల్లో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా, సినిమాలో అత్యంత కీలకమైన లక్ష్మణుడి పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్‌ను ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన షూటింగ్ భాగం ఇప్పటికే పూర్తయిందనే ప్రచారం కూడా సాగుతోంది. కథ సంజీవని నేపథ్యంలో సాగుతుందని, రామాయణంలోని లక్ష్మణుడి ఘట్టానికి ప్రేరణగా అడ్వెంచర్-మైథాలజీ మేళవింపుతో సినిమా రూపొందుతున్నట్లు టాక్. విలన్ సంజీవని శక్తిని తెలుసుకుని ప్రారంభమయ్యే ప్రయాణమే సినిమా ప్రధాన కథాంశమని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!