

త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆదర్శ కుటుంబం సినిమాకు సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడితో పోలిస్తే థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాణం కోసం సుమారు రూ.130 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ఇంతటి మొత్తాన్ని తిరిగి రాబట్టడం నిర్మాతకు పెద్ద సవాలుగా మారినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందు వ్యాపారంపై భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ, విడుదల తరువాత పరిస్థితులు మాత్రం ఆ అంచనాలకు భిన్నంగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాజెక్టు ఆర్థిక ఫలితాలపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈ సినిమాకు దాదాపు రూ.30 నుంచి రూ.40 కోట్ల వరకు నష్టాలు వచ్చే అవకాశముంది. ఇంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రానికి ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగకపోతే ఆ ప్రభావం పెట్టుబడిదారులపై కచ్చితంగా పడుతుంది. మరి ఫైనల్ రన్లో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!