

భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం మాస్ జాతర. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు మాస్ జాతర సినిమాను సంయుక్తంగా నిర్మించారు. నవీన్ చంద్ర ప్రతినాయక పాత్ర పోషిస్తుండగా.. రాజేంద్రప్రసాద్, నరేష్, ప్రవీణ్, హిమజ, వీటీవీ గణేష్, హైపర్ ఆది, అజయ్ ఘోష్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. విదు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహించారు. అక్టోబర్ 31న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మాస్ జాతర ఓటీటీ పార్ట్నర్ ఎవరు? ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది?
మాస్ జాతర ఏ ఓటీటీలో?
మాస్ జాతర మూవీ డిజిటల్ రైట్స్‌ని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ డీల్ వాల్యూ ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. థియేటర్లో రిలీజైన 4 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే నిబంధన మేరకు ఒప్పందం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో మాస్ జాతర చిత్రం నవంబర్ చివరి వారంలో ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉంది. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి మాస్ జాతర ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం కావొచ్చు లేదా మరింత ముందుగా రావొచ్చు. దీనిపై నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!