

ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటిస్తున్నారు. విడుదలైన పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపింది. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తప్పుకున్నారన్న ప్రచారం ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఓ సన్నివేశం విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రకాష్ రాజ్ మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఆయన తప్పుకున్నారన్న టాక్ ఉంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉండగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదలై డివైడ్ టాక్‌ను ఎదుర్కొంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. విడుదలకు ముందు ఏర్పడిన హైప్‌కు అనుగుణంగా ఫలితం రాకపోవడంతో ఈ సినిమా నిరాశ కలిగించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!