

ప్రపంచ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మైఖేల్ జాక్సన్ జీవితాన్ని చూపించే మైఖేల్ సినిమా ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. భావోద్వేగాలతో కూడిన కథనం, సంగీతం, వ్యక్తిగత జీవితంలోని సంఘటనలను సున్నితంగా చూపించిన తీరు ఈ చిత్రానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. జాఫర్ జాక్సన్ నటన కూడా మంచి ప్రశంసలు అందుకుంది.
మొదటి భాగం చివర్లో ఇచ్చిన సూచనలు రెండో భాగంపై ఆసక్తిని పెంచాయి. సీక్వెల్‌కు మైఖేల్ జాక్సన్ అనే పేరు పెట్టే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇది సాధారణంగా కనిపించినా, కథలో కొత్త మార్పును సూచిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండో భాగంలో ఆయన ప్రపంచ స్థాయి స్టార్‌గా ఎదిగిన ప్రయాణం, విజయాలు, వివాదాలు అన్నింటినీ చూపించే అవకాశం ఉంది.
ఇక విడుదల తేదీపై కూడా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెండో భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అభిమానులు మాత్రం పూర్తి కథను తెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!