

యూట్యూబ్ నుంచి సినిమా హీరోయిన్ వరకు ఎదిగిన వైష్ణవి చైతన్య ప్రయాణం ఇప్పుడు మరో మలుపు తిరుగుతోంది. మొదటగా అల వైకుంఠపురములో, రంగ్‌దే, టక్ జగదీష్ వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన ఆమె, ఆనంద్ దేవరకొండతో కలిసి నటించిన బేబీ సినిమాతో హీరోయిన్గా మారింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు, ప్రేక్షకుల ప్రేమ, అవార్డులు అందుకుంది.
ప్రస్తుతం ‘ఎపిక్: ద సెమిస్టర్’ అనే సినిమాలో నటిస్తున్న వైష్ణవి, త్వరలో కోలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జి. వి. ప్రకాష్ హీరోగా, ‘హాట్‌స్పాట్ టూ మచ్’ తో గుర్తింపు తెచ్చుకున్న విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా ప్లాన్ అవుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా జి. వి. ప్రకాష్, హీరోయిన్గా వైష్ణవి చైతన్య నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అజిత్ నటించిన వాలిమై సినిమాలో ఆమె చిన్న పాత్ర చేసింది. అయితే ఈ కొత్త ప్రచారం నిజమైతే, కోలీవుడ్‌లో కథానాయికగా ఇది వైష్ణవి చైతన్యకు తొలి సినిమా అవుతుంది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!