

దేశవ్యాప్తంగా మరోసారి ఎన్నికల హడావిడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23 న జరుగుతాయి. మే 4 న అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అదే రోజున తమిళనాడుకు కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా తేలనుంది.
ఈ నేపథ్యంలో హీరోయిన్ త్రిష పుట్టిన రోజు కూడా మే 4 న ఉండటంతో సోషల్ మీడియాలో పోస్టులు, ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. అదే రోజున ఫలితాలు రావడంతో, విజయ్ పార్టీ భారీ విజయాన్ని సాధిస్తే త్రిషకు డబుల్ సెలబ్రేషన్ జరుగుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో విజయ్ – సంగీత విడాకుల కేసు విచారణ వచ్చే నెల 20 న ఉండగా, ఎన్నికలు వచ్చే నెల 23 న జరగనున్నాయి. దీంతో ఈ తేదీలు విజయ్‌కు పెద్ద పరీక్షగా మారాయని చర్చ జరుగుతోంది. అలాగే విజయ్, త్రిష మధ్య సంబంధం ఉందని వస్తున్న వార్తలతో ఈ విషయం మరింత హాట్ టాపిక్‌గా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!