
క్రీడలు

మోహన్‌లాల్, మీనా ప్రధాన పాత్రల్లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన దృశ్యం 3 మూవీ దృశ్యం ఫ్రాంచైజీలో తాజా భాగంగా భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైంది. ఆంటోనీ పెరంబవూర్ నిర్మించిన ఈ చిత్రంలో అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్ధిఖీ, ఆషా శరత్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సుమారు రూ.30 కోట్లకు సొంతం చేసుకుంది.
అయితే ఓటీటీ ఒప్పందాల వివాదం కారణంగా ఈ సినిమా స్ట్రీమింగ్పై అనిశ్చితి నెలకొంది. అమెజాన్ ప్రైమ్, నిర్మాతల మధ్య వివాదం కోర్టు వరకు వెళ్లగా, తర్వాత రాజీ కుదిరినట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన 30–35 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే ఒప్పందం ప్రకారం జూన్ చివరి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. కానీ అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!