

రజినీకాంత్ హీరోగా, కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించాలనుకున్న భారీ చిత్రం మొదటి నుంచే ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రానికి మొదట సుందర్.సి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. వాటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అనూహ్యంగా సుందర్.సి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో పెద్ద చర్చ జరిగింది. రజినీకాంత్ కు కథ నచ్చకపోవడమే ఇందుకు కారణమని కమల్ హాసన్ స్పష్టత ఇచ్చారు.
ఆ తర్వాత ‘పార్కింగ్’ చిత్రంతో జాతీయ అవార్డు గెలుచుకున్న రామ్‌కుమార్ రజినీకాంత్ 173 వ చిత్రానికి దర్శకుడిగా వస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుందనే మాటలు వినిపించాయి. అయితే రామ్‌కుమార్ ముందుగా శింబు హీరోగా ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. రజినీకాంత్ సినిమా అవకాశం రావడంతో ఆ ప్రాజెక్ట్‌ను తర్వాత చేయాలని భావించినట్లు సమాచారం.
అయితే శింబు సినిమాను నిర్మించాల్సిన డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఇందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో రామ్‌కుమార్ కూడా రజినీకాంత్ సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా ‘డ్రాగన్’ దర్శకుడు అశ్వద్ మారిముత్తు పేరు తెరపైకి వచ్చింది. ఆయన రజినీకాంత్ 173 వ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇదే ఫైనల్ నిర్ణయమా? లేక ఇంకేమైనా మార్పులు ఉంటాయా? చూడాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!