

దిల్ రాజు 'మార్కో' దర్శకుడు హనీఫ్ అదేని తో తీయబోతున్న సినిమా నందమూరి బాలకృష్ణ తో అని తెలుస్తోంది. కారణాలు ఏవైనా బాలకృష్ణ, దిల్ రాజు కాంబినేషన్ లో ఇంతవరకూ ఏ సినిమా రాలేదు. దాంతో కొన్నేళ్ళుగా బాలకృష్ణతో సినిమా నిర్మించాలని దిల్ రాజు అనుకుంటున్నారు. ఒకసారి ఆ కాంబోలో సినిమా అంటూ వస్తే... అది ఇద్దరి కెరీర్లోనూ మైలురాయిగా నిలిచేది కానుంది. అందుకే దిల్ రాజు ఇంతకాలం ఓపిక పట్టారని తెలుస్తోంది.
మలయాళ చిత్రం 'మార్కో'లో విపరీతమైన హింస ఉన్నా... హనీఫ్ మేకింగ్ ను అంతా మెచ్చుకున్నారు, అది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 'మార్కో' మలయాళంలోనే కాకుండా ఆ తర్వాత వివిధ భాషల్లో డబ్ అయ్యి పలు రాష్ట్రాలలో మంచి విజయాన్నే అందుకుంది. బాలకృష్ణకు సరిపడే యాక్షన్ డ్రామాను హనీఫ్ తయారు చేసుకున్నాడని, అందుకే దిల్ రాజు ఈ సినిమా నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు మలినేని గోపీచంద్ తో తన 111వ సినిమా చేయబోతున్నాడు. దాని తర్వాత 'దిల్' రాజు మూవీ పట్టాలెక్కుతున్నట్లు తెలుస్తుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!