

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా భారీ విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఇండస్ట్రీలో తన సత్తా చాటారు. ఈ చిత్రం 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సీనియర్ హీరోలలో అరుదైన రికార్డును చిరంజీవి ఖాతాలో వేసింది. ఈ విజయంతో ఆయన తదుపరి సినిమాలపై భారీ అంచనాలు పెరిగాయి. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల, అలాగే వాల్తేర్ వీరయ్యతో హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీతో సినిమాలు చేసేందుకు చిరంజీవి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తాజా టాక్ ప్రకారం, బాబీ దర్శకత్వంలో చిరంజీవి తన 158 వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.
మెగా 158 ను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్లాన్ చేస్తోంది. అయితే బడ్జెట్, షెడ్యూల్ కారణంగా మరో నిర్మాణ సంస్థ భాగస్వామ్యం ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవి మార్క్ డ్యాన్స్, కామెడీ, యాక్షన్ పుష్కలంగా ఉండేలా దర్శకుడు బాబీ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే శ్రీలీల, అనసవ్రా రాజన్ లేదా సారా అర్జున్‌లలో ఎవరో ఒకరు చిరంజీవి కూతురి పాత్రలో నటించవచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది (2027) సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమాకు చిరంజీవి సరసన హీరోయిన్గా సీనియర్ నటి ప్రియమణి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇప్పటికే బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో నటించిన ప్రియమణికి చిరంజీవితో ఇది తొలి సినిమా కానుంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న ప్రియమణికి ఈ అవకాశం కెరీర్లో కీలక మైలురాయిగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిలింనగర్ టాక్ ప్రకారం, ఈ సినిమాకు ఆమెకు రూ.1.5 నుంచి రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్‌తో పాటు అదనపు సౌకర్యాలు కూడా ఆఫర్ చేసినట్లు వినిపిస్తోంది. ఇది ఆమె కెరీర్లోనే అత్యధిక పారితోషికం కావచ్చని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!