

‘అఖండ 2’ తరువాత బాలకృష్ణ నటించే తదుపరి సినిమాలో కొంత చారిత్రక నేపథ్యం ఉండేలా మొదట కథను సిద్ధం చేశారు. అయితే ‘అఖండ 2’ ఎదురైన ఫలితాల తర్వాత ఈసారి మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని బాలయ్య నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కథను మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మొదట ఈ సినిమాలో బాలయ్య మహారాజు గెటప్‌లో కనిపిస్తారని ప్రచారం జరిగినా, ఆ అంశంపై ఇప్పుడు స్పష్టత లేదు. కథ సాంఘిక చిత్రంగానే ఉన్నప్పటికీ, అందులో చారిత్రక నేపథ్యం ఉండటం వల్ల భారీ వీఎఫ్ఎక్స్ అవసరం అవుతుందని, దాంతో మేకింగ్‌లో ఆలస్యం జరిగే అవకాశం ఉందని భావించినట్టు తెలుస్తోంది. అలాంటి కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అన్న సందేహం కూడా ఉండటంతో, ఈసారి రిస్క్ తీసుకోకుండా మాస్ మసాలా కథను ఎంచుకున్నారని సమాచారం.
‘వీరసింహారెడ్డి’ తరహాలో పూర్తి స్థాయి వినోదాన్ని అందించే సినిమాతో ముందుకు రావాలని బాలయ్య, గోపీచంద్ మలినేని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ‘అఖండ 2’ విడుదల సమయంలో ఎదురైన పరిస్థితులు మళ్లీ రాకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని మేకర్స్ చెబుతున్నారు. బాలయ్యకు మరో బలమైన విజయాన్ని అందించాలనే లక్ష్యంతోనే ఈ కథ మార్పు జరిగిందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.


.jpg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!