

అల్లు అర్జున్ చేయబోయే సినిమాల జాబితా నుంచి దర్శకుడు బోయపాటి శ్రీను పేరు తొలగిపోయినట్టు తెలుస్తోంది. కొంతకాలంగా బన్నీ–బోయపాటి కాంబినేషన్‌పై జోరుగా చర్చ జరిగింది. ‘సరైనోడు’ తర్వాత మరో భారీ సినిమా రాబోతోందన్న ప్రచారం కూడా సాగింది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీతో పెద్ద సినిమా ఉంటుందని అల్లు అరవింద్ ప్రకటించడంతో, అది బోయపాటిదే అని చాలామంది భావించారు.
కానీ ‘అఖండ-2’ సినిమా ఫలితం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ఆ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత బన్నీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. బోయపాటి కూడా బన్నీతో సినిమా చేస్తానని గతంలో ప్రకటించినా, ప్రస్తుతం ఆ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు దాదాపు లేవని అంటున్నారు.
ఇప్పటికే అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే లోకేశ్ కనగరాజ్‌తో మరో సినిమా చేయనున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఓ మలయాళ దర్శకుడు కూడా లైన్లో ఉన్నట్టు సమాచారం. ఈ పరిణామాలతో బోయపాటి తదుపరి సినిమా ఎవరితో ఉంటుందన్నదే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!