

మిల్కీ బ్యూటీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా భాటియా గత 20 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. కొత్త హీరోయిన్లు ఎంతమంది వచ్చినా, తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎప్పటికప్పుడు టాప్‌లోనే కొనసాగుతోంది. తనకు పోటీనే లేదన్న స్థాయిలో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తూ, ఇప్పటికీ ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది.
ఇటీవల న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా గోవాలో జరిగిన ఓ గ్రాండ్ ఈవెంట్లో పాల్గొన్న తమన్నా కేవలం ఆరు నిమిషాల పర్ఫార్మెన్స్కు 6 కోట్ల రూపాయలు తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే నిమిషానికి కోటి రూపాయల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుందనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మొత్తం విన్న నెటిజన్లు ఆమె క్రేజ్‌ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకుముందు కూడా తమన్నా స్పెషల్ సాంగ్స్‌తో భారీ పాపులారిటీ సంపాదించింది. రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలోని ‘కావాలయ్యా’ పాటకు ఆమె భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే ‘స్త్రీ 2’ సినిమాలోని ‘ఆజ్ రాత్’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె సీనియర్ హీరోల సినిమాలకే ఎక్కువగా ఎంపిక అవుతోంది. రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో నిలకడగా కొనసాగుతున్న తమన్నా ప్రయాణం నిజంగా ప్రశంసనీయం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!