
షోస్

వనాటు సముద్ర జలాల్లో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రత నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) వెల్లడించింది. వనాటులోని సోలా పట్టణానికి పశ్చిమాన సుమారు 200 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు సమాచారం.
భూకంపం సముద్ర ప్రాంతంలో సంభవించడంతో దాని ప్రభావంపై వివరాలు తెలియాల్సి ఉంది. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందా? సునామీ ముప్పు ఉందా? అనే అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. తాజా పరిణామాలపై సంబంధిత అధికారులు వెల్లడించే వివరాల కోసం ఎదురుచూస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!