

హైదరాబాద్‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు సుమారు రూ.1.1 కోట్ల విలువైన 1.136 కిలోల మెథాంఫెటమిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. భోపాల్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సులో ఈ డ్రగ్స్‌ను గుర్తించి సీజ్ చేసినట్లు సమాచారం. అక్రమంగా మాదకద్రవ్యాల రవాణా, సరఫరాను అరికట్టేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ స్వాధీనం కీలకంగా మారింది.
ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులు బస్సు నాగ్‌పూర్ చేరుకున్న సమయంలోనే దిగిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై డీఆర్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వాటిని ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అనే కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!