

వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఈ కార్యక్రమానికి హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వేడుకలో పాల్గొని అంజిలి, రఘురామ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.
నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన కొన్ని అందమైన క్షణాలను వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో పంచుకున్నారు. కార్యక్రమానికి హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. హాజరు కాలేకపోయినా మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు కూడా ధన్యవాదాలు చెప్పారు. అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల వివాహం నవంబర్ 25న జరగనున్నట్లు గతంలో షర్మిల ప్రకటించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!