

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటో ఫేక్ అని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. కొందరు ఎన్టీఆర్ అభిమానులు తన ఫొటోను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంటూ, సినీనటుడు ఎన్టీఆర్‌కు చెందిన సోషల్ మీడియా ఖాతాను ట్యాగ్ చేశారు. ఇది ఏఐ ద్వారా రూపొందించిన ఫేక్ ఫొటో అని సజ్జనార్ తెలిపారు. నెటిజన్లు ఇలాంటి డీప్‌ఫేక్‌ల బారిన పడకుండా, ఏదైనా కంటెంట్‌ను షేర్ చేసే ముందు దాని నిజానిజాలను నిర్ధారించుకోవాలని సూచించారు.
‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లే..’ పాటను ఏఐ సాయంతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన నిందితులను సీపీ సజ్జనార్ అరెస్ట్ చేశారంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన సజ్జనార్.. ఆ ఫొటో పూర్తిగా నకిలీదని స్పష్టం చేశారు. ఏఐ సాయంతో రూపొందిస్తున్న చిత్రాలు మరింత వాస్తవికంగా కనిపిస్తున్న నేపథ్యంలో, ఆన్‌లైన్‌లో కనిపించే కంటెంట్‌ను వెంటనే నమ్మకుండా వాస్తవాలను పరిశీలించిన తర్వాతే షేర్ చేయాలని సూచించారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!