

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న కేసులో దేశం విడిచి బ్రిటన్‌లో ఉంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి రుణాల వసూళ్ల వ్యవహారంపై స్పందించారు. తనకు న్యాయం జరగడం లేదని పేర్కొంటూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. మీడియా రంగానికి చెందిన సుభాష్ చంద్ర రుణ పరిష్కారానికి సంబంధించిన వార్తను ప్రస్తావిస్తూ, ఆ సమాచారం నిజమైతే తన స్నేహితుడైన సుభాష్‌కు అభినందనలు తెలిపారు.
తనపై ఉన్న రుణాల విషయంలో బ్యాంకులు, ప్రభుత్వం అంగీకరించిన వసూళ్ల వివరాలను ప్రస్తావిస్తూ మాల్యా ఇతర రుణగ్రహీతల రుణ పరిష్కారాలతో పోల్చారు. జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన సుమారు రూ.22,006.57 కోట్ల రుణాలను రూ.6.5 కోట్ల చెల్లింపుతో పరిష్కరించే ప్రతిపాదనకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపినట్లు కథనం పేర్కొంది. మరోవైపు, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల విషయంలో తన నుంచి రుణం కంటే పలుమార్లు ఎక్కువగా వసూలు చేశారని మాల్యా విమర్శించారు. రికవరీ వివరాలు ఇవ్వాలని కోరుతూ గతంలో కర్ణాటక హైకోర్టును కూడా ఆశ్రయించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!