12, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉత్తర కొరియా తదుపరి అధినేతగా కిమ్‌ జు-ఏ.. వారసత్వంపై చర్చ

Writer: Nithish 07:24 AM, 11 నవంబర్, 2026
ఉత్తర కొరియా తదుపరి అధినేతగా కిమ్‌ జు-ఏ.. వారసత్వంపై చర్చ

పురుషాధిక్య పాలనకు పేరుగాంచిన ఉత్తర కొరియాలో తొలిసారిగా ఒక మహిళ దేశాధినేతగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రస్తుత అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన కుమార్తె కిమ్‌ జు-ఏను వారసురాలిగా తీర్చిదిద్దుతున్నారన్న చర్చ తాజాగా ఊపందుకుంది. ఉత్తర కొరియా నుంచి పారిపోయి దక్షిణ కొరియాలో ఆశ్రయం పొందిన శరణార్థులు, దక్షిణ కొరియా నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. కిమ్‌ గత నాలుగేళ్లుగా తన కుమార్తెను క్షిపణి పరీక్షలు, సైనిక కవాతులు వంటి కీలక కార్యక్రమాలకు వెంట తీసుకెళ్తున్నారు. భావి నాయకురాలిగా ఆమెకు ప్రజల్లో, సైన్యంలో గుర్తింపు కల్పించడమే ఈ చర్యల వెనుక ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు. 1948లో ఉత్తర కొరియా ఏర్పడినప్పటి నుంచి మూడు తరాలుగా కిమ్‌ కుటుంబమే దేశాన్ని పాలిస్తోంది.

కిమ్‌ జు-ఏకు ప్రస్తుతం కల్పిస్తున్న అధికారిక గౌరవ మర్యాదలు చూస్తుంటే ఆమెను వారసురాలిగా ఎంపిక చేసినట్లేనని ఉత్తర కొరియా మాజీ దౌత్యవేత్త తే యోంగ్‌-హో అభిప్రాయపడ్డారు. గతంలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను వారసుడిగా పరిచయం చేసిన సమయంలోనూ ఇలాంటి ప్రొటోకాల్‌ పాటించారని గుర్తుచేశారు. అధికార వర్కర్స్‌ పార్టీలోని 17 విభాగాలకు ప్రస్తుతం ఒకే ఒక్క మహిళ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌. ఇలాంటి పురుషాధిక్య వ్యవస్థలో ఒక బాలికను అత్యున్నత నాయకురాలిగా అంగీకరించడం కొందరికి కష్టంగా ఉందని శరణార్థులు చెబుతున్నారు. అయితే, ఉత్తర కొరియాలో కిమ్‌ కుటుంబానికి దైవసమానమైన స్థానం ఉండటంతో, వారసత్వ ఎంపికలో లింగభేదం పెద్ద అడ్డంకి కాకపోవచ్చని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

ట్యాగ్లు
ఉత్తర కొరియాకిమ్‌ జోంగ్‌ ఉన్‌కిమ్‌ జు-ఏకిమ్‌ వారసత్వంఉత్తర కొరియా రాజకీయాలుదక్షిణ కొరియా నిఘాకిమ్‌ యో జోంగ్‌మహిళా నాయకత్వంవర్కర్స్‌ పార్టీఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!