

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా భారీ స్థాయిలో తన ఎయిర్ డిఫెన్స్ క్షిపణి నిల్వలను వినియోగించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. సమాచారం ప్రకారం, అమెరికా ఇప్పటివరకు 200కు పైగా థాడ్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులతో పాటు మధ్యధరా సముద్రంలో మోహరించిన యుద్ధనౌకల నుంచి 100కు పైగా స్టాండర్డ్ మిసైల్-3, స్టాండర్డ్ మిసైల్-6లను ప్రయోగించింది. దీంతో పెంటగాన్ వద్ద ఉన్న ఇంటర్‌సెప్టర్ నిల్వలు దాదాపు సగానికి పడిపోయినట్లు తెలుస్తోంది.
అమెరికా వద్ద ప్రస్తుతం సుమారు 200 థాడ్ ఇంటర్సెప్టర్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం రావడంతో రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యలు జరిగితే అమెరికా రక్షణ వ్యవస్థలపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ”లో అమెరికా-ఇజ్రాయెల్ సైనిక సమన్వయం సమర్థవంతంగా సాగిందని పెంటగాన్ స్పష్టం చేసింది. యుద్ధ విమానాలు, డ్రోన్ నిరోధక వ్యవస్థలు, క్షిపణి రక్షణ సాంకేతికతలను సమర్థంగా వినియోగించినట్లు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!