
సినిమాలు

చేపల చెరువులో కూలి పని ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమవుతున్న కూలీలను విషాదం వెంటాడింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెం, ఎన్.కొత్తపల్లి, అమలాపురం మండలం సవర్పాలేనికి చెందిన 12 మంది కూలీలు చేపల చెరువులో పని ముగించుకుని ఆటోలో స్వగ్రామాలకు బయలుదేరారు. ఎస్.యానాం సమీపంలోని రోడ్డు మలుపులో ఆటో అదుపుతప్పి పంట బోదెలో బోల్తా పడింది.
ప్రమాదంలో కూలీలు బురదలో చిక్కుకుపోగా, కొందరు బయటపడి ఆటోను పైకిలేపారు. అయితే అప్పటికే ఎన్.కొత్తపల్లికి చెందిన సంఘాని రాజు (30), వానపల్లిపాలెంలోని బర్రాయిపాలేనికి చెందిన కొడవర్తి లోకేశ్ (18) మృతి చెందారు. రాజుకు భార్య, నెలల పాప ఉన్నారు. ప్రమాదం అనంతరం ఆటో డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జానీ భాషా తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!