
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ ప్రారంభోత్సవం రాష్ట్ర మౌలిక వసతుల రంగంలో కీలక ఘట్టంగా నిలవనుంది.
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్రలో విమాన రాకపోకలు మరింత మెరుగుపడనున్నాయి. పర్యాటకం, వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలకంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!