
రాజకీయాలు

శంషాబాద్ బహదూర్గూడాలో 650 ఎకరాల భూమికి ఫెన్సింగ్ పనులు కొనసాగుతున్నాయి. భూముల విషయంలో రైతుల దీక్షా శిబిరాన్ని అర్ధరాత్రి హైడ్రా అధికారులు తొలగించినట్లు సమాచారం. దీక్షా శిబిరం వద్దే ఫెన్సింగ్ ఏర్పాటు చేయగా, పోలీసులు బహదూర్గూడా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బయటి వ్యక్తులు లోపలికి రాకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూముల కేటాయింపుపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు మార్కెట్ విలువకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని లేదా భూమికి బదులు భూమి కేటాయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భూ సేకరణ అంశంపై రైతులు, అధికారుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!