

విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికులకు మరో శుభవార్త అందింది. వారణాసి (కాశీ), కోల్‌కతా నగరాలకు నేటి నుంచి రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఈ సర్వీసులను నడపనుంది. వారానికి మూడు రోజుల పాటు ఈ విమానాలు అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త మార్గాలతో విజయవాడ నుంచి ముఖ్యమైన ఆధ్యాత్మిక, వాణిజ్య నగరాలకు విమాన కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ రెండు సర్వీసులను అధికారికంగా ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో విమానాశ్రయ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. కొత్త విమానాల వల్ల భక్తులు, వ్యాపారవేత్తలు, అమరావతి రాజధాని ప్రాంత ప్రయాణికులకు సమయం ఆదా కానుంది. ముఖ్యంగా వారణాసికి నేరుగా విమాన సౌకర్యం కలగడంపై విజయవాడ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!