
జనరల్

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని 5వ బ్లాక్లో ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ్టి నుంచి రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభంకానుంది. రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన, ఆర్థిక పురోగతికి సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. తొలి రోజు సమావేశంలో జీఎస్డీపీ వృద్ధి, మంత్రుల సింగపూర్ పర్యటన, స్వర్ణాంధ్ర విజన్, విద్య, వైద్య రంగాల పురోగతిపై అధికారులు ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు.
పెట్టుబడులు, కంపెనీల గ్రౌండింగ్, జలధార వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను పలువురు కలెక్టర్లు ప్రజెంట్ చేయనున్నారు. పరిపాలనలో సమర్థత పెంపు, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం, శాఖల మధ్య సమన్వయం బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం భావిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!