
సినిమాలు

విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) మరోసారి నీట్ (NEET) పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వైద్య విద్య ప్రవేశాలపై పూర్తి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని కోరుతూ, దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష విధానం విద్యార్థుల ప్రయోజనాలకు అనుకూలంగా లేదని పార్టీ అభిప్రాయపడింది.
ఇటీవలి వివాదాల నేపథ్యంలో నీట్ పరీక్ష విశ్వసనీయత కోల్పోయిందని, దీనివల్ల విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని TVK పేర్కొంది. విద్యార్థుల నిరసనకు మద్దతుగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని ప్రజాస్వామ్య హక్కులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడిగా పార్టీ విమర్శించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!