

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఓ మెన్స్ పీజీ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు ఆ హాస్టల్‌పై దాడులు నిర్వహించారు. అక్కడ నివసిస్తున్న ఎనిమిది మందికి పోలీసులు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, వారిలో ఆరుగురికి గంజాయిలో ఉండే టెట్రాహైడ్రోకాన్నాబినాల్ (THC) పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనిఖీల్లో సుమారు 15 గ్రాముల గంజాయితో పాటు ముందుగానే చుట్టి సిద్ధం చేసిన గంజాయి కోన్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాను అరికట్టే చర్యల్లో భాగంగా ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా గంజాయి సరఫరా చేస్తున్నారనే అనుమానంతో ముగ్గురిని ఈగల్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. వారిలో అమెజాన్ డెలివరీ బాయ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఫార్మసిస్ట్ ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారిని కౌన్సెలింగ్ కోసం తరలించారు. మరోవైపు, ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సరఫరా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!