
రాజకీయాలు

ముంబైలోని దాదర్ మెట్రో స్టేషన్ పేరును ‘చైత్యభూమి’గా మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మారక స్థలమైన చైత్యభూమికి గౌరవం కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంబేద్కర్ సేవలు, వారసత్వాన్ని గుర్తుచేసేలా ఈ పేరు మార్పు చేపట్టింది.
అయితే ఈ మార్పు కేవలం మెట్రో స్టేషన్‌కు మాత్రమే వర్తిస్తుంది. దాదర్ రైల్వే స్టేషన్ పేరు మాత్రం యథాతథంగా కొనసాగనుంది. స్థానిక ప్రజలు, వివిధ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్పుతో చైత్యభూమికి మరింత గుర్తింపు లభించనుందని భావిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!