

భారత్‌తో అమెరికాకు అత్యంత బలమైన వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. భారత్‌పై ఎవరైనా దాడి చేయాలని ప్రయత్నిస్తే అమెరికా అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమైన ట్రంప్, భారత్‌ను ప్రపంచ శక్తిగా అభివర్ణించారు. మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశాభావం వ్యక్తం చేసిన ట్రంప్, త్వరలో భారత్‌ను సందర్శించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో పశ్చిమాసియా జలాల్లో భారతీయ నావికుల భద్రత అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమని, నౌకల స్వేచ్ఛా ప్రయాణానికి అనుకూల పరిస్థితులు కల్పించాలని ట్రంప్‌ను కోరారు. ఇటీవల జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ట్రంప్, పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మోదీని ప్రశంసిస్తూ ఆయన గొప్ప నాయకుడు, చర్చల్లో దిట్ట, భారత ప్రజల పట్ల అంకితభావం కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. అనంతరం మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా భేటీ అయ్యారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!