
జనరల్

హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచాలన్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ ఫీజు పెంపు నిర్ణయాన్ని ఇటీవల బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించి రద్దు చేసినప్పటికీ, ఆ తీర్పును సవాల్ చేస్తూ అమెరికా న్యాయశాఖ అప్పీల్‌కు సిద్ధమవుతోంది.
గత ఏడాది సెప్టెంబరులో హెచ్-1బీ వీసా ఫీజును భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో పాటు పలు డెమోక్రటిక్ నేతృత్వంలోని రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేశాయి. ఫెడరల్ కోర్టు తీర్పుతో కంపెనీలకు కొంత ఊరట లభించినప్పటికీ, అమెరికా ప్రభుత్వ తాజా చర్యలతో ఈ అంశం మరికొన్ని నెలల పాటు న్యాయపోరాటంలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!