
క్రీడలు

గాంధీ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి తెలంగాణ పర్యటన రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపలేదని ఆయన అన్నారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమం, సామాజిక పరిస్థితులపై బీజేపీకి సరైన అవగాహన లేదని, రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ అవసరం లేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కృషి, వేలాది మంది ఉద్యమకారుల త్యాగాల ఫలితమని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కాళేశ్వరం, అయోధ్య వంటి అంశాలపై బీజేపీ స్పందించలేదని ఆరోపించారు. అలాగే సీబీఐ, ఈడీ, ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు విజయవంతం కావని, కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం కొనసాగుతుందని ఆయన అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!