
జనరల్

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) విడుదల చేసిన డేటా ప్రకారం దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఆహార పరిశుభ్రత రేటింగ్‌లో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. నగరంలో ఉన్న దాదాపు 25,000 లైసెన్స్ పొందిన హోటళ్లలో కేవలం 361 (సుమారు 2%) మాత్రమే పరిశుభ్రత రేటింగ్ పొందాయి.
ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఢిల్లీలో 3,394, బెంగళూరులో 2,200 సంస్థలు రేటింగ్ పొందాయి. తనిఖీల్లో లైసెన్స్ లేకుండా నిర్వహణ, గడువు ముగిసిన పదార్థాల వినియోగం వంటి లోపాలు బయటపడటంతో ప్రజారోగ్యానికి ప్రమాదం ఉన్నట్లు అధికారులు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!