

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణ, ప్రభుత్వ ఆస్పత్రుల సంసిద్ధత, ప్రజారోగ్య పరిరక్షణ చర్యలపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌రాజనర్సింహ హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల ప్రస్తుత పరిస్థితి, మందుల లభ్యత, నిర్ధారణ కిట్లు, దోమల నివారణ చర్యలు, ఫీవర్ సర్వేలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలపై అధికారులు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. వ్యాధులు వ్యాపించిన తర్వాత చికిత్స కంటే ముందస్తు నివారణకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, రోగ నిర్ధారణ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్లేట్‌లెట్లు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల లక్షణాలతో వచ్చే ప్రతి రోగికి వెంటనే పరీక్షలు నిర్వహించి తక్షణ చికిత్స అందించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!