
రాజకీయాలు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి-యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు ఆమోదం తెలిపింది. జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక, న్యాయ నిపుణుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భూముల ధరలను మార్కెట్ విలువలకు అనుగుణంగా సవరించేందుకు కూడా అనుమతి ఇచ్చారు.
అదే విధంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు, మున్సిపల్ బకాయిలపై వన్ టైమ్ సెటిల్‌మెంట్, రైతులకు సహాయం, నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఎన్డీడీబీ కు అప్పగించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఐటీఐలు, పాలిటెక్నిక్స్‌ను ఒకే స్కిల్ యూనివర్సిటీ కిందకి తీసుకురావడం, ఆధునిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు వంటి అభివృద్ధి చర్యలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!