

హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి పెరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన గ్లోబల్ టెండర్లపై 48 దేశాలకు చెందిన ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తొలి దశ పనుల కోసం ప్రభుత్వం రూ.7,345 కోట్ల అంచనా వ్యయంతో గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ భారీ ప్రాజెక్టులో నది అభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాల రంగాల్లో అనుభవం ఉన్న అంతర్జాతీయ సంస్థలు పోటీపడే అవకాశం ఉంది.
ఇప్పటికే నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశంలో 30కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు టెండర్లలో కేవలం తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థకే ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ధరతో పాటు పనుల నాణ్యతకు కూడా ప్రాధాన్యతనిస్తూ మార్కుల ఆధారంగా సంస్థలను ఎంపిక చేయనున్నారు. తద్వారా ప్రాజెక్టును నిర్దేశిత ప్రమాణాలతో, ఆర్థికంగా సమర్థవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!